సీపీఐఎం రాష్ట్ర తొలి మహాసభలు
హైదరాబాద్: సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు షురూ అయ్యాయి. ఈ మహాసభలను ఇవాళ సీపీఐఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వామపక్ష నేతలు బీవీ రాఘవులు, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ సభల్లో ఆర్థిక అంశాలతోపాటు భౌతిక, భావజాల రంగాల్లోనూ సామాజిక ఉద్యమాలు నిర్మించే అంశంపై పలు తీర్మానాలు చేయనున్నారు.రానున్న మూడేళ్లలో పార్టీ ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు. పాతికేళ్లుగా అనుసరించిన రాజకీయ విధానంపై ఇటీవలే సమీక్షించిన పార్టీ కేంద్ర కమిటీ.. ఇకపై బూర్జువా పార్టీలతో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకోవద్దని నిర్ణయించింది. దీనిపై ఈ మహాసభల్లో చర్చించి తమ అభిప్రాయాలను జాతీయ మహాసభలకు పంపుతారు. కాగా, రాష్ట్ర మహాసభల్లో పార్టీ రాష్ట్ర కమిటీ, కార్యదర్శిని ఎన్నుకుంటారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజాంగ్రౌండ్స్‌లో నాలుగు రోజుల పాటు తెలంగాణ జనజాతర నిర్వహిస్తారు. దీనిని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








